One Nation One Election: ఒకేసారి రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభ ఎన్నికల కోసం ఉద్దేశించించబడిన ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’’కు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించిన కొన్ని వారాల తర్వాత తాజాగా ఈ రోజు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దశల వారీగా ఏక కాలంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ సిఫారసు చేసింది.
Read Also: KTR: ఆ రైతులను విడిచి పెట్టమని రేవంత్‌కు చెప్పండి.. రాహుల్‌ని కోరిన కేటీఆర్..
ఇదిలా ఉంటే, ఈ నిర్ణయం కేంద్రంలోని అధికార పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని కాంగ్రెస్, ఆప్ వంటి ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ పార్టీలు ఏకకాల ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి.అయితే, బిల్లుపై వ్యతిరేకత ఉన్న కారణంగా ఏకాభిప్రాయం కోసం ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.