అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొని వంతెనపై నుంచి కింద పడిపోయిన ప్రమాదంలో మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. తీవ్రగాయాల కారణంగా అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో ప్రయాణీకుడు గాయపడ్డాడని, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
Also Read:LRS Scheme: మే 31 వరకు ఎల్‌ఆర్‍ఎస్ రాయితీ గడువు పొడిగించిన ప్రభుత్వం..!
క్లీవ్ లాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపింది. మానవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్ చనిపోయినట్లు వెల్లడించింది. భారత కాన్సులేట్ జనరల్ ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. కాన్సులేట్ కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వారికి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థుల మృతితో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.