Tamil Nadu: అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు.. పొత్తు సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో అన్నాడీఎంకే, దాని మిత్ర పక్షం బీజేపీకి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పొత్తు ఉంటుందా? లేదా ? అన్నది ఆసక్తి రేపుతోంది. ఐదుగురు బీజేపీ నేతలు అన్నా డీఎంకేలో చేరడంతో మొదలైన వివాదం ముదిరింది. ఒకేసారి 13 మంది బీజేపీ నేతలు పార్టీ వీడటం రాజకీయంగా హాట్ టాఫిక్ గా మారింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. తీరు నచ్చక ఆ పార్టీ నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమి మధ్య చీలిక వచ్చింది. దీంతో అన్నాడీఎంకే పై అన్నమలై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
2019లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాయి. దాదాపు మూడు ఎన్నికల్లో కలిసే పోటీ చేసినా ఓటమి తప్పలేదు. మొత్తం 234 సీట్లున్న తమిళనాడులో బీజేపీకి నాలుగు స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల ఐటి వింగ్ చీఫ్ సిఆర్టి నిర్మల్ కుమార్‌తో సహా అనేక మంది బిజెపికి చెందిన నేతలు ఎఐఎడిఎంకెలో చేరారు. దీంతో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఏఐఏడీఎంకే ‘సంకీర్ణ ధర్మాన్ని’ ఉల్లంఘిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. అంతేకాదు అన్నాడీఎంకే అధినేత ఇ పళనిస్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
Read Also: Delhi: ఢిల్లీ కేబినెట్లో చేరిన ఇద్దరు కొత్త మంత్రులు
అయితే, బీజేపీ నేతల చర్యలను అన్నాడీఎంకే ఖండించింది. రాజకీయ నాయకులు పార్టీలు మారడం సాధారణమని పేర్కొంది. గతంలో మాజీ మంత్రి నైనార్ నాగేంద్రన్‌తో సహా పలువురు సీనియర్ నాయకులు బిజెపిలో ఎలా చేరారో ఉదహరించారు. అయితే, ఈ చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తామని మాజీ మంత్రి డి జయకుమార్ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే ఎన్డీఏకు సారథ్యం వహిస్తుందని డి జయకుమార్ చెప్పారు.
ఎఐఎడిఎంకె శిబిరంలో మాజీ సీఎంలు పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం మధ్య ఆధిపత్యం కోసం గొడవ జరిగింది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత, అన్నాడీఎంకే మూడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీ చేసి ఓడిపోయింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూటమి ఓడిపోవడంతో పార్టీలు కలిసి ప్రచారం కూడా చేయలేదు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, పార్టీ తన పాదముద్రను విస్తరించడానికి దూకుడుగా ప్రయత్నిస్తోందని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
- Tags
- AIADMK
- bjp
- D Jayakumar
- NDA
- Tamil Nadu
తాజావార్తలు
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!