AI Videos: ఏఐ సహాయంతో మహిళ అశ్లీల ఫోటోల సృష్టి.. ఆపై బ్లాక్‌మెయిల్.. చివరకు..?
- ఏఐ దుర్వినియోగానికి సంబంధించిన సంచలన ఘటన
- ఏఐ సాయంతో మహిళ అశ్లీల ఫోటోలు, వీడియోలు సృష్టించినట్లు ఆరోపణ
- ఫేక్ వీడియోలు చూపించి బాధితురాలిని బ్లాక్‌మైల్, లైంగిక వేధింపులు
- బాధితురాలు ఎదిరించడంతో ఎడిట్ చేసిన కంటెంట్‌ను బహిర్గతం చేసిన నిందితుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Videos: ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ జిల్లాలో సాంకేతికత దుర్వినియోగానికి సంబంధించిన అత్యంత భయానక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఆవరసరాలుకు, మంచిపనులకే కాకుండా నేరాలకు కూడా ఆయుధంగా మారుస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఈ కేసు సైబర్ క్రైమ్ రంగంలో పోలీసులకు కొత్త సవాల్‌గా మారింది. ఒక ఫైనాన్స్ ఏజెంట్ ఏఐ సాయంతో ఓ మహిళ జీవితాన్ని నాశనం చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే..
SBI వినియోగదారులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి తగ్గనున్న హోమ్ లోన్స్ EMIలు..!
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే హర్తలా కాలనీకి చెందిన నిందితుడు.. ముగల్‌పురా ప్రాంతానికి చెందిన యువతిపై ఏఐ సాంకేతికతతో ఫేక్ అశ్లీల ఫోటోలు, వీడియోలు సృష్టించాడు. వాటిని అడ్డం పెట్టుకుని ఆమెను బ్లాక్‌మైల్ చేస్తూ చాలాకాలంగా లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ ధైర్యం చేసి ప్రతిఘటించగానే.. ప్రతీకారంతో ఆ వ్యక్తి ఎడిట్ చేసిన వీడియోలు, ఫోటోలను బహిర్గతం చేయడమే కాకుండా, ఏకంగా ఆమె మొబైల్ నంబర్‌ను అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడు.
దీంతో బాధితురాలికి పెద్దెత్తున గుర్తు తెలియని నంబర్ల నుంచి అసభ్యకర కాల్స్ రావడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఏఐ ద్వారా ఇలాంటి బ్లాక్‌మైలింగ్, దోపిడీపై ఆ జిల్లాలో నమోదు అయిన మొదటి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే సైబర్ సెల్‌తో పాటు సివిల్ లైన్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈ ఘటనకు నేపథ్యం ఒక సాధారణ గృహ అవసరాల కొనుగోలే.
H1b visa: హెచ్1 బీ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే..!
25 ఏళ్ల యువతి తండ్రి, చిన్న కుమార్తె వివాహం కోసం ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి వాషింగ్ మెషిన్, ఫ్రిజ్, కూలర్‌ను కంతులపై కొనుగోలు చేశారు. ఆ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే సంజయ్ సింగ్ నెలవారీ కంతులు వసూలు చేయడానికి వారి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో కుటుంబంతో పరిచయం ఏర్పడింది. దురదృష్టవశాత్తు యువతి తండ్రి క్యాన్సర్‌తో మృతి చెందడంతో కుటుంబం ఆర్థికంగా బలహీనమైంది. ఇదే అవకాశంగా భావించిన నిందితుడు మొదట వేధింపులకు దిగాడు. బాధితురాలు ఎదిరించడంతో ఆమెను ఇరికించేందుకు ఏఐ సాయంతో అశ్లీల వీడియోలు తయారు చేసి వైరల్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!