Ahmed Hussein Al-Sharaa: అగ్రరాజ్యం గతంలో ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తి తాజాగా వైట్ హౌజ్‌లో ఒక దేశానికి అధ్యక్షుడిగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇంతకీ ఆ ఒకప్పటి ఉగ్రవాది.. ఇప్పటి దేశాధినేత ఎవరని ఆలోచిస్తున్నారా.. సిరియన్ అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్ అల్-షరా. ఈయనను ఒకప్పుడు అగ్రరాజ్యం ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజాగా ఆయన సిరియా అధ్యక్షుడి స్థాయిలో ఐక్యరాజ్యసమితికి హాజరు కావడానికి న్యూయార్క్ వచ్చిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం యాంటీఫా ఉద్యమాన్ని దేశీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. యాంటీఫాతో సంబంధం ఉన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను దర్యాప్తు చేయడానికి ట్రంప్ ఆదేశించారు. వైట్ హౌస్ నివేదికల ప్రకారం.. యాంటీఫా రాజకీయ హింస, అల్లర్లు, పోలీసులపై దాడులు, ఆన్‌లైన్ డాక్సింగ్ వంటివాటిల్లో పాల్గొంటుందని పేర్కొంది. ఈ ఉద్యమం అమెరికా ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా పని చేస్తుందని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. “ఆంటిఫాను ఒక ప్రధాన ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తున్నానని మా దేశభక్తులకు తెలియజేయడానికి నేను సంతోషంగా ఉన్నాను. దాని నిధులను మేము దర్యాప్తు చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగిస్తాము” అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. చార్లీ కిర్క్ హత్యపై దర్యాప్తులో దొరికిన బుల్లెట్లలో ఫాసిస్ట్ వ్యతిరేక సందేశాలు ఉన్నాయని కూడా ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
మార్కో రూబియోతో సమావేశం అయిన అల్-షరా
సిరియా అధ్యక్షుడు అల్-షరా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరు నాయకులు ఆంక్షల సడలింపు, ఇజ్రాయెల్-సిరియా సంబంధాలు, ప్రాంతీయ స్థిరత్వం గురించి చర్చించినట్లు సమాచారం. అనంతరం మార్కో రూబియో తన X ఖాతా ఒక పోస్ట్ చేశారు. “నేను సిరియా అధ్యక్షుడు అల్-షరాతో సమావేశమయ్యాను. మా సంభాషణ స్థిరమైన, సార్వభౌమ సిరియా ఉమ్మడి లక్ష్యాలను కవర్ చేసింది. అధ్యక్షుడు ట్రంప్ చారిత్రాత్మక ప్రకటన తర్వాత ఆంక్షలను ఎత్తివేయడం, ఇజ్రాయెల్-సిరియా సంబంధాలను బలోపేతం చేయడం గురించి కూడా మేము చర్చించాము” అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
రూబియో – అల్ షారా సమావేశంలో కీలకమైన అంశంగా ఇజ్రాయెల్-సిరియా సంబంధం నిలిచింది. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. అయితే తాజా చర్చను ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కీలకమైనదిగా విశ్లేషకులు పరిగణస్తున్నారు. మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలంగా ఉన్న అస్థిరతను తగ్గించడానికి సిరియా, ఇజ్రాయెల్ మధ్య శాంతి పవనాల వీచేలా కొత్త ప్రారంభం కావాలని అమెరికా కోరుకుంటోంది. సిరియా అధ్యక్షుడి న్యూయార్క్ పర్యటన, అలాగే అమెరికా నాయకులతో సమావేశం సిరియా అంతర్జాతీయ ఒంటరితనం నుంచి బయటపడటానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
READ ALSO: Italy: ఇటలీలో పాలస్తీనా ప్రకంపనలు.. హింసాత్మకంగా మారిన నిరసనలు