Ahmed Hussein Al-Sharaa: అగ్రరాజ్యం గతంలో ఉగ్రవాదిగా ప్రకటించిన వ్యక్తి తాజాగా వైట్ హౌజ్‌లో ఒక దేశానికి అధ్యక్షుడిగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇంతకీ ఆ ఒకప్పటి ఉగ్రవాది.. ఇప్పటి దేశాధినేత ఎవరని ఆలోచిస్తున్నారా.. సిరియన్ అధ్యక్షుడు అహ్మద్ హుస్సేన్ అల్-షరా. ఈయనను ఒకప్పుడు అగ్రరాజ్యం ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజాగా ఆయన సిరియా అధ్యక్షుడి స్థాయిలో ఐక్యరాజ్యసమితికి హాజరు కావడానికి న్యూయార్క్ వచ్చిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను మర్యాదపూర్వకంగా…