Italy: ఇటలీలో పాలస్తీనా ప్రకంపనలు.. హింసాత్మకంగా మారిన నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Italy: ఇటలీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ప్రధాన యూరోపియన్ దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి. అయితే ఇటలీ ప్రధాన మంత్రి జార్జియో మెలోని నేతృత్వంలోని ప్రభుత్వం పాలస్తీనాకు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. సోమవారం మిలన్, రోమ్, వెనిస్, నేపుల్స్, జెనోవాతో సహా అనేక నగరాల్లో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.
READ ALSO: IND vs BAN: గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం.. జస్ప్రీత్ బుమ్రా అవుట్!
Also Read
‘లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్’ అనే పేరుతో..
‘లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్’ అనే పేరుతో ట్రేడ్ యూనియన్లు దేశంలో సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనలో వేలాది మంది నిరసనకారులు పాల్గొని గాజాలో జరుగుతున్న హింస, వేలాది మంది మరణాలకు వ్యతిరేకంగా స్వరం వినిపించారు. ఈక్రమంలో దేశంలోని మిలన్ సెంట్రల్ స్టేషన్ వద్ద పరిస్థితి మరింత దిగజారింది. నిరసనకారులు పోలీసులపై కుర్చీలు, కర్రలను విసిరారు. దీంతో పోలీసులు జనాన్ని నియంత్రించడానికి భాష్పవాయును ప్రయోగించారు. నిరసనకారుల దాడిలో 60 మందికి పైగా పోలీసు అధికారులు గాయపడ్డారు. 10 మందికిపైగా నిరసనకారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాల రవాణాను నిరసిస్తూ డాక్ కార్మికులు అనేక ఓడరేవులను దిగ్బంధించారు. వెనిస్‌లో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. జెనోవా, లివోర్నో, ట్రీస్టే ఓడరేవులలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.
రోమ్‌లో పెల్లుబిక్కిన నిరసన..
రోమ్‌లో వేలాది మంది నిరసనకారులు రైల్వే స్టేషన్ వెలుపల ప్రదర్శన చేశారు. తరువాత వారు ఒక ప్రధాన రహదారిని దిగ్బంధించారు. నేపుల్స్‌లో జనాలు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పట్టాలపై కూర్చుని రైల్వే సేవలకు అంతరాయం కలిగించారు. బోలోగ్నాలో నిరసనకారులు ఒక రహదారిని దిగ్బంధించగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ నిరసనలతో ప్రధాన మంత్రి మెలోనిపై ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈ నిరసనలపై ప్రధాని మెలోని స్పందిస్తూ.. “దేశంలో జరుగుతున్న హింస గాజా ప్రజల జీవితాలను మార్చదు, కానీ మన పౌరులు మాత్రం బాధపడతారు” అని అన్నారు.
పాలస్తీనాను గుర్తించడానికి నిరాకరించారు..
ఇటలీ ప్రధాని మెలోని ప్రస్తుతానికి పాలస్తీనాను గుర్తించడానికి నిరాకరించారు. ఉనికిలో లేని దేశాన్ని గుర్తించడం ప్రతికూల ఫలితాన్నిస్తుందని ఆమె చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై వామపక్ష పార్టీలు, యూనియన్ల సంఘాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇటీవల పాలస్తీనాను గుర్తించిన సమయంలో ఇటలీలో ఈ నిరసనలు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో కూడా అనేక దేశాలు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. అయితే, మిలన్‌లో మెట్రో లైన్లు మూసివేయబడ్డాయి. టురిన్, బోలోగ్నాలోని విద్యార్థులు విశ్వవిద్యాలయ లెక్చర్ హాళ్లను దిగ్బంధించారు. దేశవ్యాప్తంగా ప్రజా రవాణా, సేవలు అంతరాయం కలిగింది.
READ ALSO: Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అమానుషం.. తాలిబన్ల పాలనపై విమర్శలు
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!