Pariksha Pe Charcha 2023: పరీక్షల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ప్రధాని మోదీ విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ప్రోగ్రామ్.. 2023లో కూడా జరగనుంది. పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ప్రతి ఏడాది వార్షిక పరీక్షలకు ముందు ‘పరీక్షా పే చర్చ’ పేరుతో విద్యార్థులతో ప్రధాని ఇంటరాక్ట్ అవుతారు. ఈ సారి ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు వందలాది పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించింది. ప్రధాని మోడీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాలను పంపిణీ చేసింది. పరీక్షా పే చర్చా 2023కి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన “ఎగ్జామ్ వారియర్స్” పుస్తకాన్ని విద్యార్థుల కోసం కొత్త మంత్రాలతో నవీకరించారు. ఈ పుస్తకం ఇప్పుడు విడుదల చేయబడింది. 13 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది. వివిధ రాష్ట్రాల గవర్నర్లు తమ తమ రాష్ట్రాల్లో పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఎగ్జామ్ వారియర్స్ అనేది పరీక్షా మంత్రాలు, బోర్డు పరీక్షలకు చేరుకుంటున్న విద్యార్థుల కోసం ఒత్తిడి నిర్వహణ చిట్కాలతో నిండిన పుస్తకం. మోడీ పుస్తకం తాజా ఎడిషన్ 13 భాషలలో అందుబాటులో ఉంది.
Drivers Protest: మోగిన సమ్మె సైరన్.. వేతనాలు పెంచాలని బస్సు డ్రైవర్లు ఆందోళన
ఈ నెల 27న ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా చాలా స్కూల్స్‌లో విద్యార్థులు వీక్షించే విధంగా బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసుకునేందుకు బీజేపీ కమిటీ వేసింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ఎజెండాలోనూ ఈ అంశాన్ని చేర్చింది. ఈ రోజు పలు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాలు, బహుమతి ప్రదానోత్సవాల్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. మోడీ పిలుపు మేరకు బీజేపీ నేతలు హెల్తీ బేబీ షోలు నిర్వహిస్తున్నారు. ఈ ‘పరీక్షా పే చర్చ 2023’ కార్యక్రమంలో కేవలం కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ పాల్గొనడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. దేశం నలుమూలల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని పోటీలను పెట్టి, విజేతలైన వారికి మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానం ఉంటుంది.