Aghori Srinivas: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ శ్రీనివాస్ గురించి తెలియని వారుండరు. అప్పట్లో శ్రీనివాస్ ఇరు రాష్ట్రాల్లో గందరగోళం సృష్టించాడు. అనేక పరిణామాల మధ్య జైలు జీవితం సైతం గడిపిన అఘోరీ శ్రీనివాస్ గురించి ప్రస్తుతం ఆసక్తికర నిజాలు బయటకు వస్తున్నాయి. శ్రీనివాస్, వర్షిణి జంట గతంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఇద్దరూ మధ్యప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే.. శ్రీనివాస్ నుంచి దూరమైన వర్షిణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. శ్రీనివాస్ అమ్మాయిగా మారడినికి గల కారణాలన్ని వెల్లడించింది.
READ MORE: Leopard: సిమెంట్ మైనింగ్ ప్రాంతంలో చిరుత సంచారం.. భయపడుతున్న ఉద్యోగులు..
అఘోరీ అమ్మాయిగా మారకంటే ముందు సోషల్ మీడియాలో అనేక ఫొటోలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు అన్నీ అసలైనవేనని శ్రీవర్షిణి స్పష్టం చేసింది. “సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు అన్ని అసలైనవే. వాళ్ల ఇంటికి నేను వెళ్లినప్పుడు తాను డ్రామా వేసిన ఫొటోలు చూయించాడు. అప్పుడు అబ్బాయిగానే ఉన్నాడు. వాళ్ల ఊర్లో చిన్న ఇల్లు ఉంది. నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. వాళ్ల అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. అప్పుడు కూడా మా అన్న నన్ను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. వాళ్ల ఊర్లో అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పుడు అక్కడి జనం చెట్టుకు కట్టేసి కొట్టారు. చెట్టుకి కట్టేసి కొట్టడం, హర్ట్ చేయడం వల్ల అమ్మాయిగా వేషం వేసుకొచ్చాడు. వయసు కూడా నాతో 27 ఏళ్లు అని చెప్పాడు. అది కూడా అబద్దమే. ఒక్క మంత్రం సైతం రాదు. వాడి కంటే నేనే బెటర్. నేను పూజలు బాగా చేస్తా. లలిత సహస్త్రా నామం చదువుకుంటా. ఒక్క కాళభైరవాష్టకం కూడా రాదు.” అని వర్షిణి తెలిపింది.
READ MORE: Aghori Srinivas: వామ్మో.. అఘోరీ శ్రీనివాస్ ఆదాయం మామూలుగా లేదుగా.. షాకింగ్ నిజాలు చెప్పిన వర్షిణి