Aghori Srinivas: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ శ్రీనివాస్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన శ్రీనివాస్‌ను అనేక వివాదాలు చుట్టు ముట్టాయి. జైలు జీవితం సైతం గడిపిన శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అయితే.. అప్పట్లో అఘోరీ శ్రీనివాస్, వర్షిణి సంచలనానికి తెర లేపారు. ఏపీకి చెందిన వర్షిణిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే.. వర్షిణి ప్రస్తుతం అఘోరి నుంచి దూరమై పూర్తిగా మారిపోయింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. అఘోరీ శ్రీనివాస్‌తో దాదాపు రెండు నెలలు గడిపినట్లు తెలిపింది. ఈ రెండు నెలల్లో దేవాలయాలకు ఎక్కువగా తిరిగామని చెప్పింది. అంతేకాదు.. అఘోరీ ఆదాయం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది.
READ MORE: Kanakadhara Stotram: మీరు కటిక పేదరికంలో ఉన్నారా.. అయితే, ఈ స్తోత్రం పఠిస్తే ధనవంతులు కావడం పక్కా..
ఎక్కడికి వెళ్లినా భక్తులు భోజనాలు వండి పెట్టేవారు. కారుకు ఫుల్ ట్యాంక్ పెట్రోలు పోయించే వాళ్లని వర్షిణి తెలిపింది. “భక్తులు బట్టలు సైతం పెట్టేవాళ్లు. చాలా మంది భక్తులు డబ్బులు సైతం ఇచ్చే వాళ్లు. పెట్రోల్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ఇలా ఏసీ కారులో తిరుగుతూ రోజుకు రూ.25 నుంచి రూ.30 వేల వరకు సంపాధిస్తున్నాడు. నేను పక్కన ఉండి మొత్తం చూశాను. ఒక సారి వచ్చిన డబ్బులను లెక్క పెట్టాను. రోజు గుళ్లకు వెళ్లడం పెట్రోల్ బంక్‌ల వద్ద పడుకోవడం అంతే.. సపరేట్‌గా ఇల్లు లేదు. ఆశ్రమం పెడతామని నాతో చెబుతుండేవాడు. నేను అప్పుడు ఒక ట్రాన్స్‌లో ఉన్నా.. నాకేమీ తెలియలేదు.” అని వర్షిణి వెల్లడించింది.
READ MORE: Bhu Bharati: భూ భారతి రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపులో అక్రమాలు.. ఒక్కరోజే రూ.8 లక్షలు గల్లంతు