IPL 2023: ఐపీఎల్ ఫైనల్ తర్వాతే.. ఆసియా కప్ వేదికపై తుది నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2023 నిర్వహణపై సందిగ్దం కొనసాగుతున్న వేళ ఐపీఎల్ ఫైనల్ రోజే దీనిపై ఓ క్లారిటీ రానుందా..? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. సుమారు 8 నెలలుగా కొనసాగుతున్న ఆసియా కప్ నిర్వహణ వివాదానికి త్వరలోనే తెరపడనుందా..? ఈ టోర్నీని పాకిస్తాన్ లేదా శ్రీలంకలలో నిర్వహించే అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్-16 ఫైనల్ ఇందుకు వేదిక కానుంది.
Also Read : Serial Killer: 30 మంది చిన్నారుల హత్య.. వీడికి జీవిత ఖైదు కూడా చాలా చిన్న శిక్షే
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ఐపీఎల్16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ కు రావాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి.. శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధిపతులకు ఆహ్వానం పంపించారు. మే 28న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరుగనుంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా కూడా ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, శ్రీలంకకు చెందిన క్రికెట్ బోర్డుల ప్రతినిధులు ఐపీఎల్ ఫైనల్ కు వస్తారని ఆసియా కప్ భవితవ్యం మీద ఇక్కడ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ట్వీట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
Also Read : Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
గత రెండు నెలల క్రితం ఆసియాకప్ ను పాకిస్తాన్ లో నిర్వహించేందుకు ఏసీసీ అంగీకరించింది. భారత్ తో జరిగే మ్యాచ్ లను మాత్రం తటస్థ వేదికపై జరిపించాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఉన్నట్టుండీ ఈ టోర్నీని శ్రీలంకకు తరలిస్తున్నారని.. అలా అయితే తాము ఆసియా కప్ ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ బెదిరింపులకు దిగినట్టూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా.. పీసీబీ హైబ్రిడ్ మోడల్ కు బీసీసీఐకి అంగీకారం తెలిపిందన్న వార్తలపై కూడా బోర్డు ప్రతినిధులు కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని.. ఐపీఎల్ ఫైనల్ కు మూడు దేశాల క్రికెట్ బోర్డుల అధిపతులు వచ్చిన తర్వాత నిర్వహించే సమావేశంలో అన్ని వివరాలు వెల్లడవుతాయని తెలిపారు.

తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!