After Bus Breakdown Truck Runs Over It: ఈ మధ్యకాలంలో ప్రమాదం ఎటునుంచి పొంచి వస్తుందో తెలియడం లేదు. ప్రాణం ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో మరణం వెంటాడుతూ వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో 11 మంది చనిపోయారు. రాజస్తాన్ లోని భరత్ పూర్ లో ఈ ఘటన జరిగింది.
Also Read: Rohit Shetty: సౌత్ సినిమాల గురించి కామెంట్స్ చేసారు… క్లాష్ కి దిగండి పుష్పగాడి దెబ్బ ఏంటో చూస్తారు
జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ఓ ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 11 మంది దుర్మణం పాలయ్యారు, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జాతీయ రహదారిపై జరిగింది. వివరాల ప్రకారం బస్సు రాజస్థాన్‌లోని పుష్కర్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు వెళ్తుంది. ఇంతలో లఖన్‌పూర్ ప్రాంతంలోని అంట్రా ఫ్లైఓవర్ వద్ద బస్సులో ఇంధనం అయిపోవడంతో బస్సు అక్కడ వేచి ఉంది. బస్సు డ్రైవర్ తో పాటు కొంతమంది ప్రయాణికులు బస్సు వెనుక నిలబడి ఉన్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఓ ట్రక్కు బస్సును వెనక వైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సు బ్రిడ్జి మీద నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో 11 మంది అప్పటికప్పుడే మరణించారు. చనిపోయిన వారిలో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. వారు అక్కడికక్కడే మరణించారు. అంతే కాకుండా 12 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. దీంతో అక్కడ అంతా విషాద వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ గుజరాత్ కు చెందిన వారిగా తెలుస్తుంది.