Afghanistan: ఆకస్మిక వరదలు.. 17 మంది మృతి, రోడ్డున్న పడ్డ 1,800 కుటుంబాలు..!
Afghanistan: అఫ్గానిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అకస్మిక వరదలు సంభవించడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో మరో 11 మంది గాయపడినట్లు అఫ్గానిస్తాన్ జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ANDMA) ప్రకటించింది. దేశవ్యాప్తంగా చాలా కాలంగా కొనసాగుతున్న కరువుకు తొలి భారీ వర్షాలు ముగింపు పలికినప్పటికీ.. ఈ సమయంలో వచ్చిన వరదలు ప్రజల్ని తీవ్రంగా కలవరపెట్టాయి.
OTR: నల్గొండ కాంగ్రెస్ రచ్చ.. డిసిసి పీట పై ఉక్కుపాదం
Also Read
- SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..
- SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
అక్కడి అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తీవ్ర వాతావరణ పరిస్థితులు మధ్య, ఉత్తర, దక్షిణ, పశ్చిమ అఫ్గానిస్తాన్ ప్రాంతాల్లో సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయన్నారు. వరదల వల్ల పలు జిల్లాల్లో మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లగా, పశువులు కూడా మృతి చెందాయని తెలిపారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 1,800 కుటుంబాలు ప్రభావితమయ్యాయని.. ఇప్పటికే బలహీనంగా ఉన్న పట్టణ, గ్రామీణ సముదాయాల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
హెరాత్ ప్రావిన్స్‌లోని కాబకాన్ జిల్లాలో ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు హెరాత్ ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి మహ్మద్ యూసుఫ్ సయీది వెల్లడించారు. సోమవారం నుంచి వరదలు ప్రభావితం చేసిన జిల్లాల్లోనే ఎక్కువగా ప్రాణనష్టం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వరదల తీవ్రతను అంచనా వేసేందుకు ANDMA ఇప్పటికే అత్యంత ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. ప్రజల తక్షణ అవసరాలు, నష్టాలపై సమగ్ర సమాచారం సేకరించేందుకు సర్వేలు కొనసాగుతున్నాయని అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపై పాట్ కమిన్స్ తీవ్ర ఆవేదన.. దాని వల్లనే ఓడిపోయామంటూ..
-
OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
-
SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
-
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్‌లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!