ఆంధ్రప్రదేశ్ మెగా క్రీడా టోర్నీకి సిద్ధమవుతోంది.. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏర్పాట్లలో మునిగిపోయింది.. అందులో భాగంగా ఆడుదాం ఆంధ్రా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది.. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించబోతున్నారు.. గ్రామ , వార్డు సచివాలయ, మండల , నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నారు.. 15 ఏళ్ల వయసు…