ఆ ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి కేవలం ఉత్సవ విగ్రహంలా మారిపోయారా? అసలు అలాంటి వ్యక్తి ఒకరున్నారన్న సంగతిని అదే జిల్లాకు చెందిన సీనియర్ మినిస్టర్స్‌తో పాటు ఉన్నతాధికారులు సైతం మర్చిపోయారా? ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా మారింది? ఏయే సమీకరణలు తేడా కొడుతున్నాయి? కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు కేరాఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా. మామూలుగా పార్టీలో వ్యవహారాలే తేడాగా ఉంటాయని అనుకుంటే… అందులోనూ… నల్లగొండ మేటర్స్ ఇంకాస్త తేడాగా ఉంటాయంటూ…
Minister Vivek : తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. మంత్రి వివేక్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సహ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై ఆయన చేసిన విమర్శలు సంచలనంగా నిలిచాయి. నిజామాబాద్‌లో మీడియాతో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. “నేను కష్టపడి పనిచేస్తున్నా, నాపై కుట్రలు జరుగుతున్నాయి. కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ కుట్రల వెనుక ఎవరో నాకు తెలుసు,” అని వ్యాఖ్యానించారు. “మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి నాపై విమర్శలు…
New Ministers Chambers : తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు సచివాలయంలో తమ తనఖా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చాంబర్ల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గంలోకి తీసుకున్న అడ్లూరి లక్ష్మణ్‌కు సచివాలయ మొదటి అంతస్తులో 13, 14, 15, 16 నంబర్ గదులు కేటాయించగా, మంత్రి వివేక్ వెంకటస్వామికి రెండో అంతస్తులో 20, 21, 22 నంబర్ గదులు లభించాయి. వాకిటి శ్రీహరికి రెండో అంతస్తులోనే…
అందరి కృషి, ఆశీర్వాదంతో తనకు మినిష్టర్ పదవి దక్కిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పనిలో నిజాయితీగా ఉండాలని, నిత్యం పార్టీ కోసం పనిచేయాలన్నారు. మీ కుటుంబ సభ్యుడిగా అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని చెప్పారు. కష్టాల్లో తోడుగా నిలిచిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సహకారంతో ముందుకు సాగుతానని, ఆయనకు ఎప్పుడూ అండగా నిలుస్తానని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం లేదు? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.…
మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనకు రెండు కళ్లు అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి సహాయ సహకారాలతోనే తాను ఇంతటి వాడిని అయ్యాను అని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దయతో ప్రజలకు సేవ చేసే భాగ్యం తనకు వచ్చిందని, తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా అన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి దక్కిన విషయం…
రీసర్వేలో గ్రామకంఠంగా పట్టా భూమి.. మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు కూటమి ప్రభుత్వం ఏర్పడినాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కొనసాగిస్తున్నారు.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.. ఇక, 38వ రోజు “ప్రజాదర్బార్” కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి…
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల పైన సత్యదూరమైన ఆరోపణలు చేయడం జరిగిందన్నారు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికిపోతుంటే బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో కనీసం అట్టి కరోనా వ్యాధిని ఆరోగ్య…
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన అంతా.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు నడిచిందని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ మీద తిరుగుబాటు వస్తుందని కేసీఆర్ అంటున్నారు.. ఆరు నెలల కింద కూడా మూడోసారి తమదే రాజ్యం అన్నారు.. చివరకు ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్కు క్లియర్ తీర్పు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారన్నారు. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్,…
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల గడువులోపలే 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటిలను అమలు చేయడం జరిగింది, మిగిలిన రెండు గ్యారెంటీలను త్వరలోనే అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన టెంపుల్ సిటీ అభివృద్ధి, పాల్ టెక్నిక్ కళాశాల, ఐటీఐ…