Site icon NTV Telugu

Trisha: మిమ్మల్ని చూస్తే నాకు భయమేస్తోంది..

Trisha

Trisha

నటి త్రిష, నటుడు అజిత్ నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కోపంగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఇంటర్నెట్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్‌మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేసింది. వాళ్లది వారిది విషపూరితమైన స్వభావం, ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పోస్టులో పేర్కొంది.

READ MORE: Tahawwur Rana: ముంబై ఉగ్రదాడుల్లో పాక్ ఐఎస్ఐ ప్రమేయం.. మేజర్ ఇక్బాల్, సమీర్‌ల పాత్ర..

‘‘విషపూరితమైన వ్యక్తులు.. అసలు మీరెలా జీవిస్తున్నారు? మీకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది? ఖాళీగా కూర్చొని ఇతరులను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో పిచ్చిపిచ్చి పోస్టులు పెట్టడమేనా మీ పని? మిమ్మల్ని చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. మీతోపాటు జీవించే వారి విషయంలో బాధగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మీది పిరికితనం. ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా’’ అని త్రిష ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేసింది. తాజాగా రిలీజ్ అయిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ సినిమాలో కొంతమంది త్రిష యాక్టింగ్‌ ఏమీ బాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. తమిళం తెలిసినప్పటికీ వేరే వారితో డబ్బింగ్‌ చెప్పించడం ఏంటని కొందరు మండిపడ్డారు. ఈ నెగిటివ్ పోస్టులకు విసుగు చెంది ఆమె ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.

READ MORE: Tariffs War: ముదిరిన టారిఫ్ వార్.. అమెరికా వస్తువులపై 125% సుంకాలు పెంచిన చైనా..

Exit mobile version