Sushmita Sen : నటి సుస్మితా సేన్ తన ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ శ్రద్ధ వహిస్తారు. జిమ్, యోగా చేయడం ద్వారా తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు పెద్ద షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని సుస్మితా సేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం సుస్మిత పరిస్థితి నిలకడగా ఉంది. గుండెపోటు తర్వాత సుస్మితా సేన్ మళ్లీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను షేర్ చేసింది. ఫోటోలో, సుస్మిత వర్క్ అవుట్ చేస్తూ కనిపిస్తుంది.
Read Also: Tollywood: చిత్రసీమలో డబుల్ థమాకా!
ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ సుస్మిత, ‘నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగవుతోంది. నేను ఇప్పుడు నా కార్డియాలజిస్ట్ అనుమతితో వర్కవుట్లు ప్రారంభించాను. ఇలా నా హోలీని సంతోషంగా జరుపుకున్నారు. మీరు హోలీని ఎలా జరుపుకున్నారు?’ అంటూ రాసుకొచ్చారు. సుస్మిత చేసిన పోస్ట్‌ను చాలా మంది లైక్‌లు, కామెంట్‌ల వర్షం కురిపించారు. అంతే కాకుండా చాలా మంది ఆమెకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
Read Also: Kriti Sanon: వరుణ్ ధావన్ వల్ల ప్రభాస్ కి సారీ చెప్పాల్సి వచ్చింది…
‘ఆర్య 2’ వెబ్ సిరీస్ విజయం తర్వాత ప్రస్తుతం సుస్మిత ‘ఆర్య 3’లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం సుస్మిత ‘ఆర్య 3’ సిరీస్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అభిమానులు ‘ఆర్య 3’ కోసం ఎదురుచూస్తున్నారు. సుస్మిత ఎప్పుడూ తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తుంది. కాబట్టి, నటి ‘ఆర్య 3’ సిరీస్‌ను ఎప్పుడు ప్రకటిస్తుందనే దానిపై అభిమానులు శ్రద్ధ చూపుతున్నారు. సుస్మితా సేన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నటి తన అభిమానులతో టచ్‌లో ఉండటానికి ఎప్పుడూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.