టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి రోజాకు మద్దతుగా అలనాటి తారులు నిలుస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మీనా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే.. టీడీపీ నేత బండారుపై మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారని, బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయన్నారు మీనా. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనమని ఆమె విమర్శించారు. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీ కి వచ్చినప్పటి నుండి నాకు తెలుసునని, ఆమె తో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె కోసం నాకు పూర్తిగా తెలుసునన్నారు.
Also Read : Tejas : ఆసక్తి రేకెత్తిస్తున్న కంగనా రనౌత్ ‘తేజస్’ ట్రైలర్..
రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ అని, రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి అని మీనా వ్యాఖ్యానించారు. ఆమె ఇలా నీచంగా మాట్లాడితే భయపడుతుంది అనుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు. ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారా అని మీనా మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే మంత్రి రోజాకు మద్దుతా సీనియర్ నటులు ఖుష్బూ, రమ్యకృష్ణ లతో పాటు మహరాష్ట్ర ఎంపీ, నటి నవ్‌నీత్ కౌర్ మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. అయితే.. ఇప్పటికే బండారు సత్యానారాయణపై పోలీసులు కేసు నమోదు చేసిన అరెస్ట్ చేశారు.
Also Read : Allu Arjun: లీక్డ్ డైలాగ్ తెలిస్తే పాన్ ఇండియాకి పూనకాలు వస్తాయి…