వేర్ ఈజ్ పుష్ప గ్లిమ్ప్స్ లో “అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం… అదే పులే రెండు అడుగులు వెనక్కి వచ్చిందంటే పుష్ప వచ్చాడని అర్ధం” డైలాగ్ పెట్టి పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ ఒక్క డైలాగ్ తో పుష్ప 2 సినిమా రేంజ్ ఏంటో చెప్పేసిన సుకుమార్, పుష్ప 1 జుజుబీ మాత్రమే పుష్ప 2 అసలైన సినిమా గ్లోబల్ రీచ్ గ్యారెంటీ అనే రేంజులో సినిమా చేస్తున్నాడు. భారీ సెట్స్, హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పుష్ప 2 స్టాండర్డ్స్ ని బడ్జట్ గురించి ఆలోచించకుండా పెంచేస్తున్నాడు సుకుమార్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి అంతే రెగ్యులర్ గా అప్డేట్స్ బయటకి రావట్లేదు.
సుక్కూ అండ్ టీమ్ చాలా జాగ్రత్తగా పుష్ప 2 షూటింగ్ ని చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా పుష్ప 2 డైలాగ్ లీక్ అంటూ ఒక డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “సంపడానికి ఒచ్చినోళ్లు సైలెంట్ గా ఏసి పోవాలే గానీ సప్పుడు సేత్తే సూత్తు కుర్సోనీకీ ఇక్కడ ఉన్నది పిచ్చోడు కాదు… పుష్ప గాడు” అనే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ పుష్ప 2 సినిమాలో ఉందో లేదో తెలియాలంటే 2024 ఆగస్టు 15 వరకూ వెయిట్ చేయాల్సిందే. ఆ రోజే బాక్సాఫీస్ ముందుకి పుష్ప గాడి ఎంట్రీ ఉంటుంది. మరి పుష్ప సినిమాతో స్టేట్ బౌండరీస్ దాటిన సుకుమార్ అండ్ అల్లు అర్జున్… పుష్ప 2తో దేశ హద్దుల్ని కూడా దాటి పాన్ వరల్డ్ అంటారేమో చూడాలి.