బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా ఈ భామ పేరు పొందింది. ఏ విషయం గురించి అయిన కూడా కంగనా షూటిగా సమాధానం ఇస్తుంది.ప్రస్తుతం ఈ భామ భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తేజస్.. సర్వేశ్ మేవారా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ ను కూడ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్ ను కనుక చూసినట్లయితే… దేశాన్ని రక్షించే పైలట్, వీర సైనికుల ప్రయాణం నేపథ్యంలో సాగే కథ గా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కంగనా రనౌత్ ఫైటర్ జెట్ పైలట్ తేజాస్ గిల్ పాత్రలో నటిస్తోంది. రొన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 27న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.అయితే కంగనా రనౌత్ రీసెంట్ గా సౌత్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టింది. సౌత్ లో వరుస సినిమాలు చేయాలనీ వుంది అని ఓ ఇంటర్వ్యూ వేదిక గా చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే చంద్రముఖి 2 సినిమా తో ఈ భామ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేక పోయింది.టైటిల్ రోల్‌లో కంగనారనౌత్ పర్‌ఫార్మెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో వేటయ్య రాజుగా లారెన్స్ కూడా అద్భుతంగా నటించాడు.. కానీ సినిమా కథా కథనంలో కొత్తదనం లేకపోవడం తో సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.