Sunny Leone: ఏంటీ సన్నీ లియోన్ పరీక్ష రాసిందని అనుకుంటున్నారా!. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కర్ణాటక టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షలో చాలా విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటక టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరవుతున్న ఒక అభ్యర్థి తన అడ్మిట్ కార్డ్‌లో తన ఫోటోకు బదులు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫోటోను చూసి షాక్ అయింది. అది కాస్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడ్మిట్ కార్డు స్క్రీన్ షాట్ వైరల్ కావడంతో విద్యాశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. కర్ణాటక టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్షలో చాలా విచిత్రమైన ఈ కేసు తెరపైకి వచ్చింది. ఓ యువతి హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫోటో స్థానంలో సన్నీ లియోన్ ఫోటో ఉండగా.. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. హాల్ టికెట్‌ను అడ్డుపెట్టుకుని నెటిజన్లు ప్రభుత్వం, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
Ravindra Jadeja Wife: బీజేపీ అభ్యర్థుల జాబితాలో రవీంద్ర జడేజా భార్య.. !
శివమ రుద్రప్ప కాలేజీలో ఓ విద్యార్థిని హాల్‌టికెట్‌పై సన్నీలియోన్ ఫోటో ఉండడంతో అధికారులు కంగుతిన్నారు. తర్వాత అక్కడి ప్రిన్సిపాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దరఖాస్తును ఆన్లైన్లో దాఖలు చేసేటప్పుడు, సమర్పించేటప్పుడు లేదా ఫోటోను అప్లోడ్ చేసే సమయంలో పొరపాటు జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తును పూరించలేదని, తన తరపున ఇతరులను చేయమని కోరిందని తెలిసింది. అయితే అభ్యర్థే స్వయంగా ఆన్లైన్లో దరఖాస్తును పూరించాలని, దాని కోసం కేటాయించిన వినియోగదారు ఐడీ, పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వరాదని విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష హాల్‌టికెట్‌ను అభ్యర్థులు మాత్రమే రూపొందించాలి కాబట్టి దానిలో తమ పాత్ర ఏమీ లేదని డిపార్ట్మెంట్ తెలిపింది. “ఈ విషయంపై ఏ మీడియా రిపోర్టింగ్ చేసినా డిపార్ట్మెంట్ పాత్ర లేదు. ఇంకా ఈ విషయంపై దర్యాప్తు చేసి, ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మేము పోలీసులను అభ్యర్థించాము” అని పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ తన వివరణలో పేర్కొంది.