Arya: వారణాసిలో సాధువులంతా నకిలీలే.. హీరో ఆర్య వ్యాఖ్యలపై భగ్గుమన్న హిందూ సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీశాయి. ఆయన నటించిన తాజా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్ (Mr.X)’ ఏప్రిల్ 17న విడుదల కానున్న తరుణంలో, సినిమా ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వారణాసి సాధువుల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలు ఆధ్యాత్మిక వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
Also Read : Ramayana: ‘రామాయణ’కి జపాన్ ‘గాడ్జిల్లా’ షాక్.. ఐమ్యాక్స్ స్క్రీన్స్ కోసం భారీ యుద్ధం తప్పదా?
Also Read
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ఆర్య తన కెరీర్ ఆరంభంలో ‘నాన్ కడవుల్’ (తెలుగులో ‘నేను దేవుణ్ణి’) షూటింగ్ సమయంలో వారణాసిలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అఘోరాలు మరియు సాధువుల జీవితాలను దగ్గరగా పరిశీలించానని చెబుతూ.. ‘వారణాసిలో ఉన్న సాధువులలో సుమారు 40 శాతం వరకు నకిలీవారు ఉండే అవకాశం ఉంది. కొందరు నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సాధువుల వేషంలో తిరుగుతున్నారని, వారికి ఎటువంటి ఐడీ కార్డులు ఉండవు. అంతేకాకుండా, కుంభమేళా సమయంలో జనసమూహంలో కొందరి వద్ద అధునాతన ఆయుధాలు కూడా ఉండవచ్చని పోలీసులు తనను హెచ్చరించారని ఆర్య వెల్లడించారు.
ఇక ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో హిందూ సంఘాలు, ఆధ్యాత్మిక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారణాసి వంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని, అక్కడ నివసించే సాధువులను నేరస్థులతో పోల్చడం హిందూ ధర్మాన్ని కించపరచడమేనని వారు మండిపడుతున్నారు. మరోవైపు, ఆర్య అభిమానులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన కేవలం తన వ్యక్తిగత అనుభవాలను, ఆ సమయంలో పోలీసులు చెప్పిన విషయాలను మాత్రమే పంచుకున్నారని, అందులో తప్పులేదని వాదిస్తున్నారు. దీంతో ‘మిస్టర్ ఎక్స్’ సినిమాపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ వివాదంపై ఆర్య ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ కొంత ఆందోళనలో ఉన్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!