Telangana Beers: తెలంగాణలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొత్త బీర్లు వస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఈ బీర్లపై నెట్టింట తీవ్ర స్తాయిలో విమర్శలు రావడంతో పాటు ఫన్నీ మీమ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే, వాటిపై రాష్ట్ర సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఇప్పట్లో కొత్త బీర్లను తీసుకురావడం లేదని పేర్కొనింది. అలాగే, మద్యం షాపుల నుంచి బీర్లను పక్కదారి పట్టించినా, ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మకాలు కొనసాగించిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఆబార్కీ భవన్‌లో శుక్రవారం అన్ని జిల్లాల డీసీలు, ఏసీలతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీలు, ఏసీలు అశించిన స్థాయిలో విధులు నిర్వహించడం లేదని ఎక్సైజ్ కమిషనర్ ఈ శ్రీధర్ అసహనం వ్యక్తం చేశారు.
Read Also: ONGC Recruitment: ఓఎన్జీసీ లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.70 వేలకు పైగా జీతం?
కాగా, కొందరు అధికారులు స్థానికంగా ఉండటం లేదని సమాచారం వచ్చింది.. ఇక నుంచి అందరూ అందుబాటులో ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ ఆదేశించారు. తెలంగాణలో బీర్ల కొరత ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై ఎక్సైజ్ అధికారులు స్పందించాలని తెలిపారు. అడిషనల్ కమిషనర్ అజయ్, బ్రూవరీస్ కార్పొరేషన్ జీఎం అబ్రహం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో తాము 2014 నుంచి అత్యంత నాణ్యమైన బీర్లను ఉత్పత్తి చేస్తున్నామని లీ లాసన్స్ బ్రూవరీ తెలిపింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, దినపత్రికల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది.