Pakistan: పాకిస్థాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ.. వరల్డ్ కప్ నుంచి స్టార్ బౌలర్ ఔట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే ప్రపంచకప్-2023కు ముందు పాకిస్తాన్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ జట్టు స్టార్ పేసర్ నసీం షా వరల్డ్‌కప్‌లో పలు మ్యాచ్‌లను దూరమవుతాడని టాక్. ఆసియా కప్-2023లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ నసీం షా గాయపడి.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు కూడా రాలేదు. దీంతో గాయం తీవ్రమైంది కావడంతో అతను శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ఆడలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నసీం.. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నెల రోజుల టైం పట్టవచ్చని చెప్పినట్లు తెలుస్తుంది.
Read Also: Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ మౌనం.. టీడీపీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఇదే జరిగితే నసీం షా వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండలేడు. మరోవైపు నసీం షాతో పాటు మరో పాక్ పేసర్ హరీస్ రౌఫ్ కూడా భారత్‌తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డాడు. అయితే అతని గాయం అంత తీవ్రమైంది కాకపోవడంతో వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడు. వీరిద్దరితో పాటు మరో ఇద్దరు పాక్ ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. భారత్‌తో మ్యాచ్ సందర్భంగానే అఘా సల్మాన్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో గాయపడగా, శ్రీలంకతో మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఇక, పాకిస్థాన్ కీలక ఆటగాళ్లంతా వరుసపెట్టి గాయాల బారిన పడటంతో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓటమిపాలై, ఏకంగా టోర్నీ నుంచే వైదిలిగింది. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ అక్టోబర్ 6న తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. అనంతరం అక్టోబర్ 10న శ్రీలంకతో, అక్టోబర్ 14న టీమిండియాతో తలపడుతుంది.
Read Also: Viral Video : షారుఖ్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన యువకుడు.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!