Kaleshwaram ENC Hariram: ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం.. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు
- ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం
- 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు
- హరిరామ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది ఏసీబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏసీబీ వలలో అతి పెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా ఆస్తులు కూడాబెట్టుకున్న అవినీతి అధికారి ఏసీబీ భరతం పట్టింది. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో తెలంగాణలో కీలక ప్రాజెక్టు కాళేశ్వరం ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడి జరిపింది. 200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించింది. హరిరామ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది ఏసీబీ.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
తెలంగాణలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. 24గంటల నిర్విరామంగా జరిపిన ఏసీబీ సోదాల్లో కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) హరి రామ్‌పై అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. హరి రామ్ అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 13 చోట్ల ఏకకాలంలో భారీగా సోదాలు జరిపింది. తెలంగాణ, ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అక్రమ ఆస్తుల గుర్తించింది ఏసీబీ. గజ్వెల్ లో ఏసీబీ మొదట దాడులు జరిపిండి. ఇక ఈ దర్యాప్తు కాస్త, హరి రామ్‌కు చెందిన అక్రమ ఆస్తులపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ షేక్‌పేట్, కొండాపూర్, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ లోని విల్లాలు, ఫ్లాట్లు, ఏపీ అమ రావతిలోని కమర్షియల్ ఫ్లాట్‌లతో పాటు, మార్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చెరులో 20 గుంటలు, శ్రీనగర్ లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లను కూడా గుర్తించింది ఏసీబీ.
Also Read:BRS Rajatotsava Sabha: బీఆర్ఎస్ రజతోత్సవ సభ లైవ్ అప్డేట్స్..
టోలిచౌకిలోని హరిరాం లగ్జరీ విలాస్ లోని ఆయన నివాసంలో 8 బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపాయి. 24 గంటల పాటు నిర్విరామంగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. ఈ రోజు తెల్లవారు జామున 2 గంటలకు సోదాలు ముగిసాయి. తెల్లవారు 3గంటలకు హరిరారం అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు జడ్జి ఇంట్లో హరి రామ్‌ను ప్రొడ్యూస్ చేయడంతో జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
Also Read:MI vs LSG: ప్లేఆప్స్ రేసులో ముందుకు దూసుకెళ్లేది ఎవరో? మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్.
ఏసీబీ సోదాల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు ఏసీబీ గుర్తించిన ఆస్తుల విలువ సుమారుగా రూ.200 కోట్లు కాగా, వీటి బహిరంగ మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే 10 రెట్లు అధికంగా ఉందని అంచనా. కాలేశ్వరం enc హరి రామ్ ఆస్తుల పై ఏసీబీ విచారణలో భారీగా అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ 13 చోట్ల భారీగా నివాస స్థలాలు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణంలు ఉన్నట్లు గుర్తించింది. ENC హరి రామ్, అతని బంధువుల ఇండ్లల్లో 13 చోట్ల ఏసీబీ సోదాలు జరపగా గజ్వెల్ లో భారీగా ఆస్తుల లను కలిగి ఉన్నట్లు గుర్తించిది ఎసిబి. షేక్ పేట్ , కొండపూర్ విల్లాలు.. శ్రీనగర్,నార్సింగి, మాదాపూర్ ఫ్లాట్స్ గుర్తించింది.
Also Read:ACB Raids: కాలేశ్వరం ఈఎన్సీ హరి రామ్ ఆస్తులపై కొనసాగుతున్న విచారణ
ఏపీ అమరావతిలో కమర్షియల్ భవనం ఉన్నట్లు ఏసీబీ కనుగొంది. మార్కుక్ మండలంలో 28ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చేరులో 20 గుంటలు, శ్రీనగర్ లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లు గుర్తించింది. వీటితో పాటు 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ కొత్తగూడెం కుబ్బులాపూర్ మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్ల గుర్తించింది. కొండాపూర్, షేక్‌పేట మాదాపూర్, కోకాపేట సంజీవరెడ్డి నగర్ లో భారీ భవనాలు ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. ఇక సిద్దిపేట జిల్లా కొత్తగూడెం పట్టణం మిర్యాలగూడ పట్టణంలో ఫామ్ హౌస్ లు మామిడి తోటలు భవనాలు గుర్తించింది ఏసీబీ. బీఎండబ్ల్యూ కార్ తో సహా బంగారు ఆభరణాలు, స్వాధీనం చేసుకుంది ఏసీబీ.
పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లు స్వాధీనం చేసుకుంది. ఈఎన్సీ హరి రామ్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించింది ఏసీబీ.
Also Read:Hyderabad: హైదరాబాద్లో దారుణం.. ఆటోను వెంబడించిన యువకులు.. ఒకరు మృతి
కాళేశ్వరం ఈఎన్సీ హరి రామ్ పై దాడులు కొనసాగించేందుకు ఏసీబీ అధికారులు సన్నద్ధం అయ్యారు. ఇక, బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, ఫామ్ హౌస్, కొత్తగూడెం, కుబ్బులాపూర్, మిర్యాల గూడలో ఓపెన్ ప్లాట్లను కూడా అధికారులు గుర్తించారు. ఆయన వద్ద బీఎండబ్ల్యూ కార్, భారీగా బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. కొండాపూర్ షేక్‌పేట, మాదాపూర్ కోకాపేట్ సంజీవరెడ్డి నగర్ కుత్బుల్లాపూర్ ఎల్లారెడ్డిగూడ, పటాన్ చెరు, యాదగిరిగుట్ట, మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా కొత్తగూడెం పట్టణం, మిర్యాలగూడ పట్టణంలో భారీగా స్థిరాస్తులు గుర్తించింది ఎసిబి. వీటితో పాటు పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లు కూడా అధికారులు సీజ్ చేశారు.
Also Read:CM Siddaramiah: ‘‘పాకిస్తాన్ రత్న’’.. పాకిస్తాన్‌లో సంచలనంగా సిద్ధరాయమ్య కామెంట్స్..
కాలేశ్వరం కమిషన్ బోర్డు ఎండిగా ఉన్న హరి రామ్ ఇంటికి 8 ఏసీబీ బృందాలు చేరుకోవడం సంచలం రేపింది. నిన్న తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన సోదాలు ఈ రోజు తెల్లవారు వరకు కొనసాగాయి. ఓ వైపు కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన పిసి గోష్ కమిటీ సిద్ధం చేసినా నివేదిక కీలకంగా మారింది. దీనికి తోడు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా ఓ రిపోర్ట్ అందించింది. ఇలాంటి క్రమంలో హరి రామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరగడం పెద్ద సంచలనం రేపింది. పిసి ఘోష్ రిపోర్టు, NDSA రిపోర్ట్ ఆధారంగానే ఈ ఏసీబీ సోదాలు జరిగాయి.
Also Read:Priyadarshi : ప్రియదర్శికి పెరుగుతున్న మార్కెట్.. కమెడియన్ గా మానేస్తాడా..?
గతంలో కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ హరి రామ్ అత్యంత కీలకంగా వ్యహరించారు. ఇక కమిషన్ల రూపంలో రుణాల చెల్లింపులు సమయంలో అక్రమంగా వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ అధికారులు కూడా దీనికి తగ్గట్టుగా పలు ఆధారాలు సేకరించారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో ఏసీబీ సోదాలు జరగడం సంచలనం రేపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ హరిరామ్‌ను విచారించింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు 29 వేల 737 కోట్ల రూపాయల వరకు తిరిగి చెల్లించినట్లుగా విచారణలో హరి రామ్ చెప్పాడు.
Also Read:Minister Subhash: జగన్ మానసిక స్థితి సరిగా లేదు.. లండన్ వెళ్లి వైద్యం చేయించుకున్నారు..!
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో 64 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని విచారణలో స్పష్టం చేశాడు హరి రామ్. ఇక కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందజేశామని చెప్పాడు. అయితే.. హరిరామ్ భార్య అనిత సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భార్యా భర్తలిద్దరూ కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని వందల కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఏసిబీ గుర్తించింది. ఈ కేసులో తగిన ఆధారాలతో ఏసిబి అధికారులు సోదాలు జరిపి హరి రామ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
Also Read:Andhra Pradesh: హైస్కూల్ గ్రౌండ్‌లో పడిన పిడుగు.. ఇద్దరు విద్యార్థులు మృతి
కాలేశ్వరం ఇంజనీర్ చీఫ్ హరిరామ్ అతని సతీమణి అనిత ఇద్దరు భారీగా అక్రమ ఆస్తుల కూడగట్టినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. హరిరామ్ ను అరెస్ట్ చేసిన ఏసిబి అధికారులు రిమాండ్ కు తరలించారు. హరి రామ్ అతని సతీమణి అనితపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!