ఆసియా కప్ 2025లో భారత్ తన తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తలపడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం యూఏఈ బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రాక్టీస్ సెషన్‌లో సిక్సర్ల మోత మోగించాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన భారత్ ట్రైనింగ్ సెషన్‌లో అభిషేక్ గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్…