Asia Cup 2024: వరుసగా రెండో విజయం.. సెమీఫైనల్లో భారత్!
- యూఏఈ భారత్ విజయం
- ఆసియా కప్ 2024 సెమీఫైనల్లో భారత్
- బుధవారం ఒమన్‌తో తలపడనున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బిలో భాగంగా సోమవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో వరుసగా రెండు విజయాలతో భారత్ (4 పాయింట్లు) గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉంది. ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ బుధవారం తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ 16.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ అయింది. రాహుల్ చోప్రా (50; 50 బంతుల్లో 2×4, 3×6) ఒంటరి పోరాటం చేశాడు. సిల్ హమీద్ (22), మయాంక్ కుమార్ (10) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. భారత బౌలర్లలో రసిఖ్ సలామ్ (3/15), రమణ్‌దీప్ సింగ్ (2/7) సత్తాచాటారు. అన్షుల్ కాంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్, నేహాల్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
స్వల్ప లక్ష్యాన్ని భారత్ 10.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శర్మ (58; 24 బంతుల్లో 6×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ తిలక్ వర్మ (21), ఆయుష్ బదోని (12) కీలక పరుగులు చేశారు. ప్రభసిమ్రాన్ సింగ్ (8), నేహాల్ వధేరా (6) తేలిపోయారు. భారత్ తన తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. భారత్ తన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో బుధవారం ఒమన్‌తో తలపడనుంది. ఒమన్ ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రయించింది. ఇక గ్రూప్-ఎలో శ్రీలంక నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!