AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AB de Villiers: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో RCB రెండోసారి టైటిల్ గెలుచుకున్న నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న డివిలియర్స్.. తాజాగా ముంబైలోని ఓ స్థానిక మైదానంలో సాధారణ క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ముంబైలోని ఒక లోకల్ గ్రౌండ్లో డివిలియర్స్ స్థానిక ఆటగాళ్లు, అభిమానులతో కలిసి సరదాగా మ్యాచ్ ఆడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచ క్రికెట్లో అత్యంత వినూత్నమైన షాట్లు ఆడిన బ్యాటర్లలో ఒకరైన డివిలియర్స్‌తో కలిసి మైదానాన్ని పంచుకునే అవకాశం దక్కడంతో అక్కడి ఆటగాళ్లు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
RCB ఐపీఎల్ 2026 టైటిల్ విజయాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన అనంతరం డివిలియర్స్ చాలా ఉల్లాసంగా కనిపించాడు. స్థానిక ఆటగాళ్లతో మాట్లాడటం, అభిమానులతో ఫోటోలు దిగడం, చిరునవ్వులు పంచుకోవడం మాత్రమే కాకుండా.. తన ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలికి సంబంధించిన కొన్ని షాట్లను కూడా ప్రదర్శించాడు. దీంతో అక్కడికి వచ్చిన అభిమానులు ‘మిస్టర్ 360’ మ్యాజిక్‌ను మరోసారి ప్రత్యక్షంగా చూసే అవకాశం పొందారు.
Also Read
- Scene: దీపావళి బరిలో సూర్య, 'ఆవేశం' డైరెక్టర్ సెన్సేషనల్ 'సీన్'!
- LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
- DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
- Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
డివిలియర్స్ వంటి ప్రపంచ స్థాయి క్రికెటర్ స్థానిక మైదానంలో సాధారణ ఆటగాళ్లతో కలిసి ఆడటం క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు సాధించినప్పటికీ.. అభిమానులతో మమేకమవడం, వినయంగా ఉండటం డివిలియర్స్ ప్రత్యేకతగా నిలిచింది. ఈ ఘటన మరోసారి ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
RCB అభిమానులకు ఈ ఘటన మరింత ప్రత్యేకంగా మారింది. దాదాపు దశాబ్దానికి పైగా బెంగళూరు ఫ్రాంచైజీకి సేవలందించిన డివిలియర్స్ జట్టు గుర్తింపును నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీతో కలిసి RCBకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన అతను ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ముంబైలో జరిగిన ఈ చిన్న సంఘటన కూడా డివిలియర్స్‌పై అభిమానులకు ఉన్న ప్రేమను మరోసారి చాటిచెప్పింది.
తాజావార్తలు
-
Scene: దీపావళి బరిలో సూర్య, ‘ఆవేశం’ డైరెక్టర్ సెన్సేషనల్ ‘సీన్’!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
-
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
-
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!