Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
- పంజాబ్ ఎన్నికల ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన ఆప్..
- 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా..
- ధురి నుంచి సీఎం మాన్ పోటీ..
- జైలులో ఉన్న ఎమ్మెల్యేకు కూడా టికెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం భగవంత్ మాన్ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతుున్నారు. జైలులో ఉన్న మంత్రి సంజీవ్ అరోరాకు కూడా పార్టీ టికెట్ కేటాయించింది. ఈయన లూథియానా వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటున్నారు. ఫస్ట్ లిస్టులో ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న 40 మందికి పార్టీ మరోసారి అవకాశం ఇచ్చింది.
సీఎం పోటీలో ఉంటున్న ధురి ఆప్‌కు కంచుకోటగా పరిగణించబడుతుంది. 2022 అసెంబ్లీ ఎన్నికలలో, మాన్ ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీని 58,000 ఓట్ల తేడాతో ఓడించి ఘన విజయం సాధించారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ పార్టీ బలమైన పనితీరును కనబరిచింది, ధూరి మున్సిపల్ కౌన్సిల్‌లోని 21 వార్డులలో 20 వార్డులను గెలుచుకుంది.
Also Read
- CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
- Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
- INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
- CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, ధురి నుంచే జైలులో ఉన్న ఎంపీ, వారిస్ దే పంజాబ్ అధినేత అమృత్ పాల్ సింగ్ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖడూర్ సాహిబ్ ఎంపీగా ఉన్న ఈయన ధురితో పాటు ఖడూర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో ధురిలో పోటీ పంజాబ్‌లో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాబోతోంది.
పంజాబ్ శాసనసభలో మొత్తం 117 సీట్లు ఉన్నాయి. 2027లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలో ఉంది. మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ కూడా అధికారం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అకాలీదళ్, బీజేపీ కూడా పోటీలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పంజాబ్‌లో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతోంది.
తాజావార్తలు
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
-
Konaseema: తుఫాన్ విధ్వంసం.. కరెంట్ లేక అంధకారంలో 200 గ్రామాలు.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!