Swamti Maliwal: కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్ వెయిట్ చేస్తుండగా జరిగిందిదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం ఇంట్లోనే ఏకంగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి.. ఆమెపై దాడికి తెగబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో తలమునకలై తల్లడిల్లుతున్న తరుణంలో మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది. తాజాగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆప్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని.. ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తోంది.
ఇదిలా ఉంటే స్వాతి మలివాల్‌పై జరిగిన దాడిపై ఆప్ అధికారికంగా స్పందించింది. ఆమెపై దాడి జరిగిన మాట వాస్తవమేనని రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్ తెలిపారు. సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు అంగీకరించారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ పరిగణనలోకి తీసుకున్నారని, ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటారని మంగళవారం తెలిపారు.
Also Read
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె ఫిర్యాదు మాత్రం ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీనిపై మూడు రోజుల్లాగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించగా, ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ విమర్శలు గుప్పించింది.
అసలేం జరిగిందంటే..
సోమవారం ఉదయం కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూంలో స్వాతి.. ముఖ్యమంత్రి కోసం ఎదురుచూస్తుండగా.. బిభవ్ కుమార్ ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెతో మాట్లాడుతుండగానే అమర్యాదగా ప్రవర్తించాడు. అనంతరం ఆమె దాడి చేశాడు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన ఘటన అని సంజయ్ సింగ్ అన్నారు. దీన్ని సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. బిభవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారని ఆప్ ఎంపీ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ నివాసం నుంచి ఉదయం 9.34 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందని నార్త్ డీసీపీ తెలిపారు. కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని ఓ మహిళ ఫోన్‌లో చెప్పారన్నారు. అనంతరం కొద్దిసేపటికి స్వాతి మలివాల్ సివిల్ లైన్స్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. దాడి ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటే తప్పనిసరిగా వైద్య పరీక్ష నిర్వహించాలని ఆమెకు పోలీసులు వివరించారు. ఐదు నిమిషాల పాటు స్టేషన్‌లో ఉన్న స్వాతి తాను మళ్లీ వస్తానంటూ ఎటువంటి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయారు అని నార్త్ డీసీపీ ఎం.కె.మీనా తెలిపారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు స్పందించలేదని బీజేపీ నిలదీసింది. ఒక ఎంపీ, పైగా మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే రక్షణ కరవైందని.. కేజ్రీవాల్ ఇంట్లోనే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఇంకెవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ఈ ఘటనపై స్పందించడానికి ఇన్ని గంటల సమయం ఎందుకు తీసుకుంటున్నారని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: ఆ రెండు డెడ్లీ అండ్ రేర్ కాంబో.. అందుకే వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోతున్నాడు!
-
Movie Ticket Rates Hikes : పెంచిన సినిమా టిక్కెట్ రేట్లపై ఫైర్ అవుతున్న కామన్ ఆడియన్
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!