2022లో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విధితమే. వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత నిక్కీ సినిమాలలో నటించడం కాస్త గ్యాప్ తీసుకుంది. కాకపోతే ఆది పినిశెట్టి మాత్రం వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు కాబోతున్న నేపథ్యంలో అభిమానులు వీరి నుంచి గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఈ స్టార్ కపుల్ ఆ శుభవార్తను చెప్పకుండానే పయనం సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నిక్కీ ప్రెగ్నెంట్ అయినట్లు కూడా వార్తలు వినిపించాయి. కాకపోతే అవి ఉట్టి మాటలే అన్నట్లుగా ఒక్క పోస్టుతో వాటికి చెక్ చెప్పింది నిక్కీ.
Also Read: T20 World Cup: ‘టీ20 ప్రపంచకప్ గెలవాలంటే..’ కోచ్ ద్రవిడ్‌కు ప్రత్యేక సలహా ఇచ్చిన మాజీ క్రికెటర్..
ఇకపోతే ఆది పినిశెట్టి, నిక్కీలు తాజాగా ఓ హాలిడే వెకేషన్ ట్రిప్పును ఎంజాయ్ చేశారు. థాయిలాండ్ దేశంలో వీరిద్దరూ కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. థాయిలాండ్ దేశంలో ఉన్న ఏనుగుల సంరక్షణ క్యాంపును వీరిద్దరూ సందర్శించారు. అక్కడ మీరిద్దరూ ఏనుగులతో టైం స్పెండ్ బాగా చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఇద్దరి సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Also Read: SRH vs RCB: భారీ స్కోరు చేసిన ఆర్సీబీ.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?
ప్రస్తుతం ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరల్ గా మారిన పోస్టులను చూసి అభిమానులు లవ్లీ కపుల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ దంపతులు కూడా వేరే దేశానికి వెళ్లి అక్కడ ఏనుగులతో ఉన్న క్యాంపును సందర్శించి కూతురుతో కలిసి ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.