సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. త్రిలోక్‌పురిలో పలువురు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారు.
అల్లూరిసీతారామరాజు జిల్లాలో జలపాతాలు పర్యాటకులకు ఒకవైపు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంటే అక్కడికి వెళ్ళినవారు మరణించడంతో విషాదం నెలకొంటోంది. సరియా జలపాతం టూరిస్టుల పాలిట మృత్యుకుహరంగా మారింది. అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని సరియా జలపాతం ప్రమాదభరితంగా మారింది. మంగళవారం సరియా జలపాతానికి విహారానికి వచ్చిన విశాఖకు చెందిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారి మృతదేహాలను అనంతగిరి పోలీసులు ఎట్టకేలకు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. విశాఖ జగదాంబ సమీపంలోని ఎల్లమ్మతోట ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు మంగళవారం సరియా…
చిన్నపాటి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, అధికారుల నిర్లక్ష్యం యువత ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రహరీ గోడను ఢీకొని యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద జరిగిన ఘటన ఇది. గొల్లపల్లి గ్రామానికి అనుకొని ఉన్న ఎయిర్ పోర్ట్ ప్రహారీ గోడను ఢీకొన్న నవీన్ అనే యువకుడు మరణించాడు. మలుపు వద్ద రోడ్డుకు ఎదురుగా ఉన్న ప్రహరీ కనిపించకపోవడంతో బైక్ తో ఢీకొన్నాడు యువకుడు. నవీన్ మృతి…