Viral Video: మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ లో తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వేగంగా వస్తున్న వాహనాల మధ్య ఓ మహిళ మార్గమధ్యలో పూజలు చేస్తోంది. ఆమె రోడ్డుపై మంటలు వెలిగించి కొన్ని మంత్రాలు చదువుతూ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ మహిళ చేతబడి చేస్తోందని కొందరు చెబుతుండగా.., మరికొందరు దీన్ని వింతగా చూస్తున్నారు. ఇకపోతే ఆ మహిళ చేస్తున్న పనిని చూసిన అక్కడి ప్రజలు తమ వాహనాలు ఆపేసి మరి అక్కడ నిలబడిపోయారు. నడిరోడ్డు మార్గమధ్యలో ఆమె ఇదంతా ఎందుకు చేస్తుందో మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది.
iQOO Z9s: అతి త్వరలో బడ్జెట్ ఫ్రెండ్లీ లో సరికొత్త మొబైల్ లాంచ్..
నడి రోడ్డు మధ్యలో ట్రాఫిక్ ను ఆపి మరి మహిళ పూజలు చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ విషయంపై నగర పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇకపోతే ఈ వీడియోలో మహిళ రోడ్డు మధ్యలో ఓ వాటర్ బాటిల్, నూనె, బ్యాగ్ తీసుకుని కూర్చున్న తర్వాత.. అక్కడ మంటలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ వీడియో మొదట్లో గమనించినట్లయితే., కొంతమంది ఆ మహిళను దాటకుంటూ వెళ్లిపోతున్నారు. మరి ఆ తర్వాత వెంటనే ఆమె లేచి నిలబడి కాస్త వింతగా అక్కడ ఉన్న వాహనదారులను చూడటం మొదలు పెట్టింది. ఈ ఘటనతో భయపడిపోయిన వారు రోడ్డుపై అక్కడిక్కడే ఆగిపోయారు.
ICC World cup Teams: రాబోయే ప్రపంచకప్లో మరిన్ని కొత్త జట్లు.. ఐసీసీ కీలక ప్రకటన..
అలా ఉండగానే మహిళా ఆ మంట చుట్టూ ఎగురుతూ, దూకుతూ అటు ఇటు తిరుగుతూ వింతగా ప్రవర్తించింది. ఆపై మంటల ముందు కూర్చుని తన జుట్టును విరబోసుకుని చాలా విచిత్రంగా నడుచుకుంది. ఇది చూసిన కొందరు భయపడినా.., ఆ తరువాత ఒక్కొక్కరుగా ఆ ప్రదేశం నుండి బయలుదేరారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆ తరువాత తెలిసింది.
बीच सड़क पर महिला के जादू टोने का वीडियो आया सामने
वीडियो में सरेराह महिला सड़क पर आग जलाकर जादू टोना करती हुई आ रही है नजर
जबलपुर, मध्य प्रदेश pic.twitter.com/KMzKhfVaZM
— Avinash Tiwari (@TaviJournalist) July 21, 2024