ఉత్తరప్రదేశ్‌లోని బందాలో దారుణం చోటు చేసుకుంది. మహిళ ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలను కట్ చేసిన ఘటన సంచలనం రేపింది. ఆ మహిళ పదునైన వస్తువుతో అతని ప్రైవేట్ భాగాలను కత్తిరించింది. ఆ వ్యక్తి తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తనపై దాడికి యత్నించడంతో తాను ఈ దారుణానికి ఒడిగట్టానని మహిళ పేర్కొంది.