QR Code Scanner Alert: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన కారణంగా భారతదేశంలో చాలా మంది లావాదేవీలను కేవలం మొబైల్ ఫోన్లను ఉపయోగించి సులభంగా చేసేస్తున్నారు. అయితే ఇలా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నేపథ్యంలో చాలామంది స్కామర్లు అమాయకుల నుండి భారీ మొత్తంలో కొందరు దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు కూడా మనం చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా కొందరు తెలుగు రాష్ట్రాలలో చిన్న చిన్న వ్యాపారాలను టార్గెట్ చేసుకుని వారి వద్ద ఉన్న స్కానర్ల స్థానంలో వేరే స్కానర్లను ఉంచి వారికి వచ్చే డబ్బులను ఇంకొకరి అకౌంటులకు వెళ్లేలా మోసం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Viral Video: ఇదేందయ్యా ఇది.. “గులాబీ పువ్వు పకోడీ”.. ట్రై చేసారా ఎప్పుడైనా.?
ఈ వైరల్ వీడియోలో వ్యక్తి ఓ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారుల నిర్వహిస్తున్న తోపుడు బండ్ల దగ్గరికి వెళ్లి ఆ బండ్ల దగ్గర ఉన్న స్కానర్లను పరిశీలించి అక్కడ జరుగుతున్న మోసాన్ని బయట పెట్టాడు. ఇక వీడియోలో చూపించిన విధంగా.. మామూలుగా చిరు వ్యాపారులు వారి బండి వద్ద వారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు వీలుగా కొన్ని స్టిక్కర్లను బయట అంటించి ఉంటారు. ఇది గ్రహించిన కొందరు మోసగాళ్లు స్కానర్ పై వారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కానర్ ను అతికించి వెళ్లారు. దీంతో ఎవరైనా చిరు వ్యాపారాల వద్దతో వచ్చి వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని స్కాన్ చేసి పంపిస్తున్న.. ఆ డబ్బులు వారికి చేరడం లేదు. వేరే అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి.
Double Ismart: డబుల్ ఇస్మార్ట్ క్రేజ్ మామూలుగాలేదుగా.. ఏకంగా అన్ని కోట్లకు డిజిటల్ రైట్స్..
ఇదే విషయాన్ని ఆ వ్యక్తి క్యూఆర్ కోడ్ పైన ఉన్న మరో క్యూఆర్ కోడ్ ను తీస్తూ చూపించడం మనం వీడియోలో గమనించవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారో లేదో ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే.. ఎవరికి డబ్బులు ఊరికే రావు కాబట్టి. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. ఇలాంటి పనులు చేసే మోసగాళ్ల వల్ల అనేకమంది కుటుంబాలు రోడ్డుపై పడుతున్నాయి అంటూ కొందరు కామెంట్ చేయగా.. మరికొందరేమో.., వామ్మో ఇలా కూడా మనుషుల్ని దోచేస్తారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి మీరు కూడా ఏదైనా వ్యాపారం చేస్తుంటే మాత్రం ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఒకటికి రెండుసార్లు మీ అకౌంట్ కు వినియోగదారుడు డబ్బులు పంపించడా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది. మరి ముఖ్యంగా క్యూఆర్ కోడ్ కు సంబంధించి సౌండ్ బాక్స్ ఉపయోగించడం వల్ల చాలావరకు ఇలాంటి అనర్ధాలను తప్పించుకోవచ్చు.
చిరు వ్యాపారులు జర జాగ్రత్త..! ఇదో కొత్త తరహా మోసం..QR కోడ్ స్కాన్ స్కాం..#QRcode #ScamAlert #SCAM #viralvideo #NTVTelugu pic.twitter.com/i8NFWdRXQf
— NTV Telugu (@NtvTeluguLive) July 26, 2024