అమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు 100 దేశాల యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నగరానికి చెందిన ఐటీ నిపుణుడు రామకృష్ణ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే తల్లి ప్రేమ ఒకటేనని అన్నారు.