NTV Telugu Site icon

Bhopal: మూడేళ్ల బాలికపై టీచర్ అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్లో గాయం చూసి తల్లి షాక్

Gangrape

Gangrape

దేశంలో అత్యాచారాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఆడవాళ్లను చూస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అత్యాచార వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ మృగాళ్ల కోసం ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా.. వారి బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. కోల్‌కతా ఘటన దేశంలో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.. అయినప్పటికీ హత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

Read Also: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఇక, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం..!

తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో అత్యాచార ఘటన జరిగింది. కమలా నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన బాలిక ప్రైవేట్ పార్ట్‌లపై గాయాలు చూసి బాలిక తల్లి ఒక్కసారి షాక్ అయింది. దీంతో.. బాలిక తల్లి రెండ్రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడు ఖాసీం రెహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. అతను పాఠశాలలో ఐటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో.. నిందితుడైన ఉపాధ్యాయుడు ఖాసీం రెహాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Viral video: ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్‌పై రోగి బంధువుల దాడి.. వీడియో వైరల్

Show comments