రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం మూడేళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. బోరుబావి 700 అడుగుల లోతు ఉంది. మొదట్లో దాదాపు 15 అడుగుల లోతులో ఉన్న బాలిక ఒక్కసారిగా జారి కిందకు వెళ్లింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భూపేంద్ర చౌదరి కుమార్తె చేతనా చౌదరి ఇంటి దగ్గర ఆడుకుంటున్న సమయంలో.. ప్రమాదవశాత్తు కాలు జారి తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మరో అత్యాచార ఘటన జరిగింది. కమలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాఠశాల ఉపాధ్యాయుడు మూడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం.. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన బాలిక ప్రైవేట్ పార్ట్‌లపై గాయాలు చూసి బాలిక తల్లి ఒక్కసారి షాక్ అయింది.