విజయవాడలో ఈనెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. విగ్రహావిష్కరణ విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధకుడు జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియజేసేలా స్మృతివనం ఉండబోతోందని తెలిపారు. విజయవాడ నగరం…