Nag Ashwin: కల్కి 2898 ఏడీ కథ లీక్ చేసిన నాగ్ అశ్విన్
- కల్కి 2898 ఏడీ కథ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన నాగ్ అశ్విన్
- కల్కి 2898 ఏడీ కథ మన పురాణాలు అన్నింటికి క్లైమాక్స్ లా ఉంటుందన్న నాగ్ అశ్విన్
- కొత్త సైన్స్ ఫిక్షన్ మైథాలజీని చూస్తే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది చూడాలని ఆసక్తిగా ఉన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Prelude Of Kalki 2898 AD – Episode 1 Telugu: కల్కి 2898 ఏడీ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించగా వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కల్కి 2898 ఏడీపై అంచనాలు ఆకాశానికి చేరినా ఈ కంటెంట్ ఏంటి అనే అంశం మీద అనుమానాలు ఉన్నాయి. దీంతో జనాల అనుమానాలు దూరం చేసేలా డైరెక్టర్ నాగ్ అశ్విన్‍తో మాట్లాడించి ఓ వీడియోను రిలీజ్ చేసింది మూవీ టీమ్. కల్కి 2898 ఏడీ ప్రిల్యూడ్‍లో ఎపిసోడ్-1 అంటూ ఆ వీడియోను నేడు (జూన్ 18) తీసుకొచ్చింది. ఈ సినిమా కథ గురించి ఈ వీడియోలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు నాగ్ అశ్విన్. ఈ క్రమంలో కల్కి 2898 ఏడీ కథ మన పురాణాలు అన్నింటికి క్లైమాక్స్ (ముగింపు) లాగా ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పారు. కలియుగంలో ఎలా, ఏం జరగొచ్చు అనేది ఉంటుందని, ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో ఎవరైనా ఈ స్టోరీని రిలేట్ చేసుకోవచ్చని చెప్పారు.
Renuka Swamy Case: ఎవర్రా ఈ పవిత్ర గౌడ? టాప్ ట్రెండింగ్లోకి దర్శన్ ప్రియురాలు
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
“మన పురాణాల్లో అతిగొప్పది మహాభారతం. చాలా క్యారెక్టర్లు ఉంటాయి. విష్ణుమూర్తి అవతారాలు కృష్ణుడితో ముగిసాయి. అక్కడి నుంచి కలియుగంలోకి వెళ్లినప్పుడు ఈ కథ ఎలా ఉంటుందన్నది పూర్తిగా క్రియేటివ్ ఇమాజినేషన్. కృష్ణుడి అవతారం తర్వాత పదో అవతారం కల్కి. కలియుగం అంతం ఎలా జరుగుతుంది.. ఎలా జరగొచ్చు అనేది ఈ సినిమాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా రిలేట్ చేసుకునే స్టోరీ అని, ఈ కథ అన్నింటికీ క్లైమాక్స్. మనం చదివిన పురాణాలకు, క్యారెక్టర్లకు ఒక క్లైమాక్స్ లాగా చేస్తే ఈ కథ” అని నాగ్ అశ్విన్ చెప్పారు. “కలి అనే వాడు ప్రతీ యుగంలోనూ ఉంటాడు. ఒకసారి రావణుడిలా.. ఒకసారి దుర్యోధనుడిలా ఉంటాడనుకుంటే.. చివరగా కలియుగంలో ఫైనల్ రూపం తీసుకుంటే అలాంటప్పుడు ఎలాంటి హీరో వస్తాడనే ఆలోచనతో రాసిన కథ ఇది. రాసుకుంటే ఈ కథకు ఐదేళ్లు పట్టింది, ఆ ప్రపంచంలోకి వెళ్లి ఈ కొత్త సైన్స్ ఫిక్షన్ మైథాలజీని చూస్తే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనేది చూడాలని ఆసక్తిగా ఉన్నానని అన్నారు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!