Budget 2024: క్రీడల బడ్జెట్.. గతేడాది కంటే రూ.45.36 కోట్లు ఎక్కువ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sports Ministry Gets Rs 3,442.32 crore in Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్‌లో క్రీడలకు ప్రాధాన్యం దక్కింది. బడ్జెట్‌లో క్రీడలకు రూ.3,442.32 కోట్లు కేటాయించారు. గత ఏడాదితో పోల్చుకుంటే.. రూ.45.36 కోట్లు ఎక్కువ నిధులను ఇచ్చారు. గతేడాది బడ్జెట్‌లో క్రీడలకు రూ.3,396.96 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
Also Read: IND vs ENG: నేడు ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. భారత్ బోణీ కొట్టేనా?
Also Read
2024 జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు క్రీడల బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కింది. ఖేలో ఇండియాకు రూ.900 కోట్లు కేటాయించారు. గతంతో పోల్చుకుంటే రూ.20 కోట్లు ఎక్కువ. శిక్షణ శిబిరాలు, మౌలిక వసతుల ఏర్పాటు, పరికరాల కొనుగోలు సహా ఇతర అవసరాల కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థకు రూ.795.77 కోట్లు కేటాయించారు. 2023తో పోల్చితే.. రూ.26.83 కోట్లు ఎక్కువ. ఇక జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.325 కోట్లు, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు రూ.22.30 కోట్లు నిధులు కేటాయించారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్‌లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!