POSCO Case: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఓ కూలీని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో చిన్నారి తాతయ్యలతో కలిసి ఇంట్లోనే ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ సమయంలో నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడు బాధిత బాలిక ఉండే ప్రాంతంలో ‘కేబుల్’ వేసే పనిని చేస్తున్నాడని అధికారి తెలిపారు. అయితే దాడి జరిగిన మరుసటి రోజు జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి తెలియజేసిందని, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
FIR File: క్యాబ్ డ్రైవర్‌ను ఎత్తుకుని నేలపై పడేసిన వ్యక్తి.. వీడియో వైరల్..
నిందితుడిని ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ సెక్షన్ 64 (Rape Attempt), ఇతర సంబంధిత నిబంధనలు, ఇంకా లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ ( POSCO) చట్టం కింద అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. ఈ సంఘటన తర్వాత, నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ జవహర్, మొఖాడాకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు అలాగే సామాజిక సంస్థల స్థానిక కార్యకర్తలు నిరసన తెలిపారు.