Suicide Case: దారుణం.. నలుగురు వికలాంగ కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య.!
- ఢిల్లీలో సంచలన ఘటన వెలుగులోకి.
- నలుగురు వికలాంగ కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య.
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
committed Suicide Case: ఢిల్లీలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వసంత్ కుంజ్‌లోని రంగపురి ప్రాంతంలో నలుగురు కూతుళ్లతో సహా ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే రెండు మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఘ్తనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఢిల్లీలోని రంగ్‌పురి ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు వికలాంగ కుమార్తెలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదుగురు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పిల్లల తల్లి ఇదివరకే క్యాన్సర్‌తో మరణించింది. శుక్రవారం అర్థరాత్రి పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి మృతదేహాలను బయటకు తీశారు. కుమార్తెలు వికలాంగులు కావడంతో తండ్రి ఈ చర్య తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
Bihar : మల విసర్జన చేసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళను ఢీకొట్టిన రైలు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
సమాచారం ప్రకారం, రంగపురి గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న తండ్రి వయస్సు సుమారు 46 సంవత్సరాలు. వీరు బీహార్ లోని ఛప్రా జిల్లా నివాసి. వారికి నలుగురు కుమార్తెలు. వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్పెంటర్‌గా పనిచేశాడు. శుక్రవారం సాయంత్రం వారి ఫ్లోర్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు జరిగిన విషయాన్ని ఇంటి యజమానికి తెలియజేయడమే కాకుండా పోలీసులకు సమాచారం అందించారు.
Fire Accident: మేడ్చల్ మెడికల్ షాప్ లో అగ్ని ప్రమాదం.. బైక్ చార్జింగ్ పెట్టడంతో మంటలు..
మృతి చెందిన తండ్రి హీరాలాల్ శర్మ(46)గా గుర్తించారు. అతని నలుగురు కుమార్తెల వయస్సు 20 – 26 సంవత్సరాల మధ్య ఉంది. హీరాలాల్ గత 28 సంవత్సరాలుగా వసంత్ కుంజ్‌లోని ఇండియన్ స్పైనల్ ఇంజూరీ సెంటర్‌లో కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. 2024 జనవరి నుంచి డ్యూటీకి వెళ్లడం లేదని సమాచారం. అంతేకాదు, అతని ఇద్దరు కూతుళ్లు పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నారు. మిగిలిన ఇద్దరు పాక్షికంగా వికలాంగులయ్యారు. హీరాలాల్ తన కూతుళ్లకు ఏదో ఒక ఆసుపత్రిలో చికిత్స చేయడంలో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. కుమార్తెలు చాలా అరుదుగా తమ గదుల నుండి బయటకు వచ్చే వారు. ఇంట్లో నుంచి మూడు ప్యాకెట్ల విషం, ఐదు గ్లాసుల్లో అనుమానాస్పద ద్రవం, ఒక చెంచా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#WATCH | Delhi: Visuals from the spot where a family of 5, a man and his four daughters, committed suicide by consuming a poisonous substance in Vasant Kunj's Rangpuri Village. https://t.co/EgU0neHEw8 pic.twitter.com/XGGvHNOLYK
— ANI (@ANI) September 28, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!