హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్,…