వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పర్వతగిరి మండలం మోత్య తండాలో జరిగింది. విద్యుత్ షాక్ కు గురైన వారిలో మొత్తం నలుగురు యువకులు ఉన్నారు. కాగా.. మొదటగా భూక్యా దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలతో ఉన్న సునీల్, రవిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.