Pushpa : టిక్ టాక్, దాని తర్వాత వచ్చిన యాప్ ద్వారా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సోషల్ మీడియా స్టార్లుగా గుర్తింపుపొందుతున్నారు. వారు చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా డ్యాన్స్ వీడియోలను నెటిజన్లు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఓ ఈవెంట్లో వ్యక్తి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. చాలా మంది ఆ వ్యక్తి చేసిన డ్యాన్స్ చూసి మెచ్చుకుంటున్నారు.
Read Also: Sukumar: లెక్కల మాస్టారే అసలైన గురూజీ…
ఆ వ్యక్తి తన గ్రామంలో ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్నాడు. అతడు మద్యం మత్తులో డ్యాన్స్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. తనకు ఇష్టమైన పుష్ప సినిమాలోని పాటకు అల్లు అర్జున్ ను ఊహించుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ డ్యాన్స్ స్టెప్స్ చూసి చాలా మంది రియాక్ట్ అయ్యారు. కొందరు అతడి డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 2 లక్షల 18 వేల మంది వీక్షించారు. అదే సమయంలో, ఈ వీడియోను చూసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఆ వ్యక్తిని సౌత్ ఇండియన్ సినిమా ‘పుష్ప’తో పోలుస్తూ పేదల పుష్ప అని వ్యాఖ్యానించాడు.