మేడ్చల్ జిల్లాలో ఓ విషాద ఘటన నెలకొంది. ఉదయం నుంచి ఎంతో ఉల్లాసంగా ఆడుకున్న ఓ బాలుడు ఉన్నట్టుండి విగతజీవిగా మారిపోయాడు. మృత్యువు ఏ క్షణంలో వస్తుందో ఊహించటం కష్టం కానీ.. మరీ ఈ చిన్నారి విషయంలో జరిగిన ఘటన మాత్రం గుండె తరుక్కుపోయేలా ఉంది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోనియా గాంధీనగర్‌లో నివాసముంటున్న 3 సంవత్సరాల జశ్వంత్ అనే బాలుడు ఉదయం నుంచి ఉత్సాహంగా ఆడుకున్నాడు.. అయితే.. తొలి ఏకాదశి కావటంతో.. సాయంత్రం చిన్నారిని తీసుకుని కుటుంబసభ్యులు గుడికి వెళ్లారు.. గుళ్లో పెట్టే ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా తీసుకున్న ఆ బాలుడికి.. ఆ ప్రసాదమే తన ప్రాణం తీస్తుందని తెలియదు.
Read Also: Mexico Heatwave: మెక్సికోలో భానుడి భగభగలు.. హీట్ స్ట్రోక్‌తో 100 మందికి పైగా మృతి
అయితే.. గుళ్లో కొబ్బరికాయ కొట్టగా.. అందులోని ఓ ముక్కను తీసి ప్రసాదంగా ఆ చిన్నారికి ఇచ్చారు. దీంతో ఆ బాబు కొబ్బరిని తీనగా.. అది కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో.. చిన్నారికి ఊపిరాడక విలవిల లాడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని హాస్పటల్‌కు తరలించారు. కానీ.. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆ చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఆ కొబ్బరి ముక్క.. ఆ బొందిలోని ఊపిరిని ఆపేసింది.. ఆస్పత్రికి వెళ్లగానే పరీక్షించిన వైద్యులు.. బాలుడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
Read Also: Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!
అప్పటి వరకు ఎంతో హుషారుగా ఆడుకున్న బాలుడు.. క్షణాల్లోనే విగతజీవిగా మారటాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మరణంతో ఆ ఏరియాలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో.. మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించలేమని మరోసారి నిరూపితమైంది.