సినీ నటి మాధవిలత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదం చాపకింద నీరులా ఇంకా కొనసాగుతూనే ఉంది. 2025 నూతన సంవత్సరం కానుకగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో మహిళల కోసం ఈవెంట్ నిర్వహించారు. జేసీ నిర్వహించిన ఈ ఈవెంట్ కు మహిళలు ఎవరు వెళ్లోద్దని మాధవీలత వీడియో రిలీజ్ చేయడంతో ఆగ్రహించిన జేసీ మాధవీ లత ఒక వ్యభిచారి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. జేసీ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో మాధవిలతకు క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో మాట్లాడాను అని వివరణ ఇచ్చారు.
కానీ సినీ నటి మాధవిలతపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు సైబరాబాద్ పోలీసులకు సినీనటి మాధవిలత ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసారు పోలీసులు. సినీనటి మాధవిని ఉద్దేశిస్తూ కొన్నాళ్ల క్రితం అభ్యంతరకర అసభ్యకరమైన దూషణలు చేసారు ప్రభాకర్ రెడ్డి. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసిన సినీ నటి మాధవిలత. ఈ కేసు వ్యావహారం ఓ వైపు కొనసాగుతుండగానే తాజాగా సినీ నటి మాధవిలతపై అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. డిసెంబరు 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మాధవిలత చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మాల మహానాడు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కొంకణి కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో మాధవిలతపై కేసు నమోదు చేశామని తాడిపత్రి పట్టణ సీఐ సాయిప్రసాద్ తెలిపారు.