Komatireddy Venkat Reddy: దాడులకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయడానికి వెనకాడమని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళ ప్రభుత్వం బుధవారం దీనిని ధృవీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి ఇటీవల తిరిగి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాజిటివ్‌గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
ఆఫ్రికా దేశం కాంగోలో మొదలైన మంకీపాక్స్ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఆఫ్రికాలోని 12 దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. ఆసియాలో కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో.. థాయిలాండ్ ప్రభుత్వం మంకీపాక్స్ కొత్త వేరియంట్ యొక్క మొదటి కేసు తమ దేశంలో సంభవించినట్లు ధృవీకరించింది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఆగస్టు 14న ఆఫ్రికా నుంచి థాయ్‌లాండ్‌కు వచ్చాడు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో.. అతన్ని పరీక్షించగా అతనికి Mpox, క్లాడ్ 1B అనే…
ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీబీ ఓఎస్డీ (OSD) రామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఘటన జరిగిన రోజే పీసీబీ ఉద్యోగులు నాగరాజు, రూపేంద్ర మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఓఎస్డీ రామారావుపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. గతంలో నమోదు 106 సెక్షన్ ను మార్చి కొత్తగా అదనపు సెక్షన్లను కలిపి ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదయింది.. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఏ1 గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ2 గా భార్య నీలిమా, ఏ3 మధుకర్ రెడ్డి పేర్లను చేర్చారు. కొర్రెముల్ల సర్వే నెంబర్ 796లో ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 38ఈ హోల్డర్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకు ప్రయత్నం చేశారని ఫిర్యాదులో తెలిపారు. పదేళ్లుగా 200 మందిని పల్లా రాజేశ్వర్ రెడ్డి నానా…
తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత మొదటిసారి సీఐడి కేసు నమోదు అయింది. నకిలీ వీసా, పాస్ పోర్టులు ఇప్పిస్తున్న ముఠాను సీఐడి అధికారులు పట్టుకున్నారు. కాగా.. ఐదు జిల్లాల్లో మూకుమ్మడిగా సోదాలు నిర్వహించింది. తెలంగాణలో సీఐడి అధికారుల దాడులు చేపట్టిన ప్రదేశాల్లో.. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్ లలో సోదాలు చేపట్టారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్టులు.. విదేశీయులకు పాస్‌పోర్టులు పొందేందుకు అవసరమైన నకిలీ పత్రాలు తయారీ చేస్తుంది ముఠా.
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రపంచాన్ని వణికిస్తోంది. కేరళలో తిష్ట వేసిన వెరియంట్ అన్ని రాష్ట్రాల్లో వ్యాపిస్తుంది. తెలంగాణలోనూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇంకా 42 మంది రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కరోనా కేసులు హైదరాబాద్ లోనే వెలుగుచూశాయని…
Malla Reddy: ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలపై మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి పై మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా.. మల్లారెడ్డి అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. శామీర్ పేట మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని…