ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ మరణించాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతుండగా ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అనంతరం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Conjoined Twins: ఇండోనేషియాలో అరుదైన ఘటన.. 4 చేతులు, 3 కాళ్లతో జన్మించిన కవలలు
17 ఏళ్ల సత్యం రహంగ్‌డేల్ భన్‌పురిలోని ధనలక్ష్మి నగర్‌లో నివాసముంటున్నాడని ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎస్‌ఎన్ సింగ్ తెలిపారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్‌కు వెళ్లాడు. జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతున్న అతడు, ఇంతలో ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు. జిమ్‌లో ఉన్న సిబ్బంది అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ యువకుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం మరణానికి గల కారణాలను వెల్లడించలేదు. పోస్టుమర్టం రిపోర్టు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అనంతరం కుటుంబ సభ్యులు సత్యం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని లంజికి తీసుకెళ్లారు. తండ్రి సుభాష్ రహంగ్‌డేల్ మసాలాలు అమ్మేవాడు. ఇద్దరు అన్నదమ్ములలో సత్యం పెద్ద కొడుకు. ఇటీవలే 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాడు. చేతికొచ్చిన కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మధ్య జిమ్ చేస్తూ.. చాలా మంది కుప్పకూలి పోతున్నారు. కాని ఇలా తక్కువ వయసు ఉన్న వాళ్లకు ఇలా జరగడం చాలా అరుదు. ఈ వార్త చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను జిమ్ లకు పంపించేందుకు భయపడుతున్నారు.